మంత్రుల రాజీనామాకు ముహుర్తాన్ని ఖరారు చేసిన సీఎం జగన్
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలకు అధ్యక్షుల నియామకంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలకు అధ్యక్షుల నియామకంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న పదవులకు మంత్రులు రాజీనామా చేయబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం జరిగే వైసీఎల్పీ భేటీలో ఈ విషయంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఉగాది నుంచే కొత్త మంత్రులు బాధ్యతలు కూడా స్వీకరిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక కొత్త జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను కూడా ఈ సమావేశంలోనే సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం. పార్టీ రీజనల్ ఇంచార్జ్లకు కొన్ని మార్పులు చేస్తారని కూడా తెలుస్తోంది.