ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటి కానుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో ఈ మీటింగ్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణకు కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్‌లతో పాటు మొత్తం 40 అంశాలపై మంత్రివర్గ మండలి చర్చించి ఆమోదముద్ర వేయనుంది. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి కూడా కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
కేబినేట్ భేటి కీలకాంశాలు ఇవే…
- 45-60 ఏళ్ల వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందించే వైఎస్ఆర్ చేయూత పధకానికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.
- చిరు వ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకంపై చర్చ
- పోలీస్ శాఖలో 40 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేసే అవకాశం
- మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై చర్చించే అవకాశం
- పర్యావరణ, జిఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించే అవకాశం
- రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఏర్పాటుపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకోనుంది
- వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీపై కేబినేట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- కురపాం ఇంజినీరింగ్ కాలేజీ, మూడు నర్సింగ్ కాలేజీలకు ఆమోదం తెలిపే అవకాశం