ఏపీలో తొలిదశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

*521 పంచాయితీలకు ఏకగ్రీవ ఎన్నికలు *2724 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు-గోపాల కృష్ణ ద్వివేది *215 కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశాం

Update: 2021-02-08 11:25 GMT

ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. 521 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 2724 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. 29 వేల 732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. వీటిలో మూడు వేల 458 సెన్సిటివ్, మూడు వేల 594 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని ద్వివేది వివరించారు. 18 వేల 608 పెద్ద బ్యాలెట్ బాక్సులు, ఎనిమిది వేల 503 మధ్యరకం, 21 వేల 338 చిన్న బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. 215 కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశామన్నారు. 519 జోనల్ అధికారులు, 1121 మంది రూట్ అధికారులు, మూడు వేల 46 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ పర్యవేక్షిస్తారని చెప్పారు. ఈసారి ప్రత్యేకంగా నోటా కూడా ఉంటుందని తెలిపారు. కోవిడ్ నిబందనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహిస్తామని.. కోవిడ్ బాధితులు ఓటర్లుగా ఉంటే వారికి పోలింగ్ చివరి గంటలో ఓటు వేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. పోలింగ్ పూర్తయినన తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు.  

Tags:    

Similar News