Anantapuram: ఆసుపత్రులపై అనంత జేసీ ఉక్కుపాదం
Anantapuram: తెలంగాణలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి నిర్వాకం వేలుగు చూసిన విషయం తెలిసిందే
Anantapuram: ఒక వైపు కరోనా వ్యాప్తితో ప్రజలు భయపడుతుంటే.. మరోవైపు ప్రజల భయాన్నే పెట్టుబడిగా చేసుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు. ఇటీవలే తెలంగాణలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి నిర్వాకం వేలుగు చూసిన విషయం తెలిసిందే. ఇక ఏపీలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో దోపిడీకి పాల్పడుతున్న ఆసుపత్రులపై అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి ఉక్కుపాదం మోపారు.
కోవిడ్ ట్రిట్ మెంట్ సాకుతో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలు చేపట్టారు. ప్రజలను దోచుకుంటున్న ఆసుపత్రులకు భారీ జరిమానా విధించారు. నగరంలోని ఆశా ఆసుపత్రికి రూ. 3 లక్షలు, ఎస్ఆర్ ఆసుపత్రికి రూ. 2.55 లక్షలు, సాయిరత్న ఆసుపత్రికి రూ. 2.10 లక్షలు, ఎస్వీ ఆసుపత్రికి రూ. 2 లక్షలు ఫైన్ విధించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ.. కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులను ఉపేక్షించబోమని చెప్పారు. రెండోసారి అదే తప్పు చేస్తే హాస్పిటల్స్ పై ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 256 జీవో ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.