Anandayya Medicine: చిత్తూరు జిల్లాలోనూ ఆనందయ్య మందు
Anandayya Medicine: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషద పంపిణీకి సర్వం సిద్దమైంది.
Anandayya Medicine: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషద పంపిణీకి సర్వం సిద్దమైంది. అయితే తొలుత ఆనందయ్య ఔషదం సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కాకాని కూడా ఈ మందు పంపిణీ కార్యక్రమంలో పాల్పుంచుకోనున్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రాలకు ఈ ఔషదం పంపించనున్నట్లు ఆనందయ్య తెలిపారు. అప్పటి వరకు కృష్ణపట్నం ఎవరు రావొద్దని కోరారు.
అయితే అనందయ్య ఔషదం నెల్లూరులోనే కాకుండా చిత్తూరు జిల్లాలోనూ తయారుచేస్తున్నారు. చంద్రగిరి ముక్కోటి తీర్థంలో ఆనందయ్య మందు తయారుచేస్తున్నారు. ముక్కోటి తీర్థంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే 'పీ' రకం ఔషధాన్ని రూపొందిస్తున్నారు. దీని కోసం ఆనందయ్య కృష్ణపట్నం నుంచి 10 రకాల మూలికలు పంపించారు. చంద్రగిరి ప్రజల నుంచి మరో 6 రకాల మూలికలను సేకరించారు. ఈ మందు తయారీలో మొత్తం 16 రకాల ఔషధ మూలికలు వినియోగిస్తున్నారు.
ఈ మందును 6 మండలాల్లోని 1,600 గ్రామాల ప్రజలకు పంపిణీ చేయనున్నారు. 1.60 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఔషధాన్ని రేపటి నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకొని మందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాకారం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.