Amaravathi: హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టు కు ఏపీ సీఐడీ
Amaravathi: చంద్రబాబు కు ఇచ్చిన హైకోర్టు స్టే పై సీఐడీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
Amaravathi: ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ విచారణకు స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సీఐడీ అధికారులు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... అమరావతి పరిధిలో అక్రమంగా వారు దళితుల భూములను లాక్కున్నారని విచారణ జరిపి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అనంతరం విచారణ జరిపి చంద్రబాబు నారాయణకు నోటీసులు అందజేశారు. అయితే చంద్రబాబు నారాయణలు ఈ కేసులోపై ఏపీ హైకోర్టుకు ఎక్కారు. తాజాగా విచారణపై స్టే తీసుకొచ్చారు. దీంతో కేసు ముందుకు సాగకుండా అయ్యింది.ఈ కేసులో తాజాగా ఏపీ సీఐడీ సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. కాగా ఈ కేసులో చంద్రబాబు నారాయణలపై 4 వారాలపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.