TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Update: 2025-03-24 00:23 GMT
Alert for Tirumala Srivari devotees VIP break darshans cancelled tomorrow

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

  • whatsapp icon

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఆలయం లోపల, ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలు నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ కారణంగా 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24న ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. 

Tags:    

Similar News