Anantapur: అక్రమాలకు నిలయంగా అనంతపురం ఆర్టీఏ కార్యాలయం

Anantapur: ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుగొలిపే వాస్తవాలు

Update: 2021-04-01 02:12 GMT
ఆర్టీఏ ఆఫీస్ అనంతపురం (ఫైల్ ఇమేజ్)

Anantapur: అనంతపురం ఆర్టీఏ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. రోజుకు ఓ వివాదంతో రచ్చకెక్కుతోంది. కొంత కాలంగా ఎక్కడా లేని విదాదాలు ఇక్కడే వెలుగు చూస్తున్నాయి. ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. ప్రతి అక్రమ వివాదంలో అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది.

కొంతకాలంగా అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అనంతపురం ఆర్టీఏ కార్యాలయం. నకిలీ దృవపత్రాలు, తప్పుడు రిజిస్ట్ర్ఱేషన్లు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాటిని దొంగ ఎన్ ఓసీలు జారీ వంటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏజెంట్ల ద్వారా ఆర్టీఏ అధికారులు సాగిస్తున్న వసూళ్ల దందాను ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. ఏసీబీ సోదాల్లో 1,65,320 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ ఇస్మాయిల్ తో పాటు ఐదుగురుఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అటెండర్ నుంచి డీటీసీ వరకూ అందరికీ మామూళ్లు మత్తులో ఉన్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

రెండేళ్లుగా ఆర్టీఏ కార్యాయలంలో ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రతి విషయంలోనూ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఏకంగా డీటీసీ ఉన్న కార్యాలయంలోనే ఇన్ని అక్రమాలు చోటుచేసుకోవడం నెలకో వివాదం బయటకి రావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అనంతపురం ఆర్టీఏ కార్యాలయంపై దృష్టి సారించలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పారదర్శకంగా ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు కార్యాలయ సిబ్బంది అక్రమాలతో పట్టుబడి వివాదాస్పదమవుతున్నా ఉన్న తాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News