పాకిస్తాన్ విమానాన్ని కూల్చిన కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు 'వీర్ చక్ర' పురస్కారం

Abhinandan Varthaman: పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని అత్యంత సాహసోపేతంగా కూల్చేసిన భారత వైమానిక దళం పైలట్..

Update: 2021-11-22 10:53 GMT

పాకిస్తాన్ విమానాన్ని కూల్చిన కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు ‘వీర్ చక్ర’ పురస్కారం

Abhinandan Varthaman: పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని అత్యంత సాహసోపేతంగా కూల్చేసిన భారత వైమానిక దళం పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ప్రతిష్టాత్మక 'వీర్ చక్ర' వరించింది. ఈ ప్రతిష్టాత్మ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అభినందన్ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

మరోవైపు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్‌కు మరణానంతరం శౌర్య చక్ర అవార్డును ప్రదానం చేశారు. శంకర్ దౌండియాల్ సతీమణి లెఫ్టినెంట్ నితిక కౌల్, ఆయన తల్లి సరోజ్ దౌండియాల్‌కు ఈ అవార్డును అందుకున్నారు. శంకర్ జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులను హతం చేసి, 200 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన మరో ఆపరేషన్‌లో ఏ ప్లస్ ప్లస్ కేటగిరీకి చెందిన టెర్రరిస్టును హతమార్చిన నాయిబ్ సుబేదార్ సోంబేర్‌కు మరణానంతరం శౌర్య చక్ర ఇచ్చారు. ఇదే సమయంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులను చంపిన ప్రకాశ్ జాదవ్‌కు మరణానంతరం కీర్తి చక్రను ప్రదానం చేశారు.

Tags:    

Similar News