Cervical Cancer :క్యాన్సర్‎ను జయించి..పండంటి పాపకు జన్మనిచ్చిన యువతి

Cervical Cancer : ఆంధ్రప్రదేశ్ కు చెందిన 27 ఏళ్ల ఓ యువతికి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నిర్థారణ అయ్యింది. గర్భసంచి తొలగించడమే దారని వైద్యులు సూచించారు. కానీ క్యాన్సర్ ను జయించి ఆ యువతి పండంటి పాపకు జన్మనిచ్చింది.

Update: 2024-07-29 02:40 GMT

 Cervical Cancer :క్యాన్సర్‎ను జయించి..పండంటి పాపకు జన్మనిచ్చిన యువతి

Cervical Cancer : క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి శరీరంలో ఎక్కడైనా సోకిందంటే ప్రాణాలతో బయటపడటం కష్టం. క్యాన్సర్ వచ్చిన బాధితుల్లో జీవితం అంధకారంగా మారుతుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తే..మహిళలకు తల్లి అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ అలాంటి క్యాన్సర్ సోకిన ఓ యువతి మాత్రం క్యాన్సర్ నే తిప్పికొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే...

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు చెందిన 27ఏళ్ల యువతికి సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. గర్భసంచి తొలగించడమే దానికి పరిష్కారమని వైద్యులు సూచించారు. అయితే ఆ యువతి హైదరాబాద్ లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు కౌన్సెలింగ్ తోపాటు వైద్యం చేసిన డాక్టర్ వసుంధఱ చీపురుపల్లి పూర్తి వివరాలను వెల్లడించారు.

తణుకుకు చెందిన 27ఏళ్ల మౌనిక అనే యువతి గర్భం దాల్చింది. అయితే గర్భంలోని శిశువుకు ఆనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో అబార్షన్ చేయించారు. మౌనిక ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెకు పరీక్షలు చేయగా..గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే గర్భసంచి తొలగించాలని వైద్యులు సూచించారు. కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

క్యాన్సన్ చికిత్స అనంతరం ఫ్రీజ్ చేసిన పిండాలను గర్భంలోకి ప్రవేశపెట్టారు. దీంతో రెండు ఫలదీకరణం చెందాయి. కుట్లు వేయడంతో గర్భసంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండదని ముందుగా గ్రహించిన వైద్యులు ఒక పిండాన్ని తొలగించారు. ఒక పిండాన్ని మాత్రమే ఉంచారు. మధ్యలో క్యాన్సర్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు కూడా చేశారు. 32 వారాల తర్వాత శిశువుకు లంగ్స్ బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు వేశారు. సరిగ్గా 37వారాల తర్వాత సిజేరియన్ చేయడంతో పండంటి పాపకు జన్మనిచ్చింది.

పాప పుట్టిన తర్వాతే ఆమెకు క్యాన్సర్ వచ్చిందని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా గర్భసంచి తొలగించాల్సిందిగా దంపతులు కోరారు. కానీ సిజేరియన్ సమయంలో గర్భసంచి తీసివేస్తే ఇబ్బందులు ఉంటాయని వైద్యులు భావించారు. ఇప్పుడు క్యాన్సర్ సమస్య లేదని అలానే వదిలేస్తే మంచిదని చెప్పారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యం గాఉన్నారని డాక్టర్ వసుంధర పేర్కొన్నారు.

Tags:    

Similar News