కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ముగ్గురు మృతదేహాల వెలికితీత..
Krishna River: మరో ఇద్దరి కోసం కొనసాగుతున్న గాలింపు...
Krishna River: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో ఏటూరు దగ్గర జరిగిన విషాద ఘటనలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మున్నేరు వాగులో గల్లంతైన చిన్నారుల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. మిగిలిన ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.