నేటి నుంచి నాలుగో విడత నామినేషన్ల స్వీకరణ

* ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు * ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన * ఫిబ్రవరి 14న నామినేషన్లపై అభ్యంతరాల స్వీకరణ

Update: 2021-02-10 03:04 GMT

Representational Image

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి నాలుగో విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగునుంది. ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా.. 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 14న నామినేషన్లపై అభ్యంతరాల స్వీకరణ, 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

ఇక ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జరగనుంది. ఫిబ్రవరి 19న రాత్రి ఏడున్నర గంటలకు ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 21న ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు తుది దశ పోలింగ్, అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ ఎంపిక జరగనుంది.

Tags:    

Similar News