ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే వెయ్యి కేసులు అదనంగా నమోదు అయ్యాయి. అయితే, కరోనా కేసుల రికవరీ మాత్రం ఆశాజనంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే వెయ్యి కేసులు అదనంగా నమోదు అయ్యాయి. అయితే, కరోనా కేసుల రికవరీ మాత్రం ఆశాజనంగా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా రికవరీ రేటు బాగుండటంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం ఏపీలో కేవలం 27వేల 300 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
ఇక, గత 24గంటల్లో 74వేల 757మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 2,901మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటివరకు 8లక్షల 11వేల 825మందికి కరోనా పాజిటివ్ రాగా 7లక్షల 77వేల 900మంది కోలుకున్నారు. ఇక, ఈరోజు 19మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6వేల 625కి చేరింది.
గత 24గంటల్లో 19మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. కడపలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు మరణించగా అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖ, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు.