ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు!

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు వెయ్యి కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 84, 534మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా.... 2849మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

Update: 2020-11-03 13:11 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు వెయ్యి కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 84, 534మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా 2849మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే, గత 24గంటల్లో 15మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 6734కి చేరింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,30,731కి చేరింది.

అయితే, కరోనా పేషెంట్ల రికవరీ రేటు భారీగా పెరగడంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21వేల 672కి తగ్గింది. అనంతపురం, గుంటూరులో ముగ్గురు చొప్పున చిత్తూరు, కృష్ణాలో ఇద్దరు చొప్పున మరణించారు. అలాగే, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,672 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 పరీక్షలు చేశారు. 

Tags:    

Similar News