Central Funds: ఏపీకి రూ.136 కోట్ల కేంద్ర సహాయం.. విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధికి నిధులు
Central Funds: పట్టణాల అభివృద్ధి కోసం కేంద్రం ఆర్థిక సాయం
Central Funds: ఏపీకి 136 కోట్ల రూపాయలు కేంద్రం సహాయం ప్రకటించింది. విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధి కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు దేశంలోని పలు ప్రధాన పట్ణణాల అభివృద్ధి కోసం కేంద్రం 4, 761 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. ఏపీకి ఇప్పటివరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 293కోట్ల 75 లక్షల రూపాయలు అందించింది. తెలంగాణకు ఇప్పటివరకు 331కోట్ల 40లక్షల రూపాయలు కేంద్ర ఆర్థిక సాయం చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో భాగంగా నిధులను కేంద్రం విడుదల చేసింది.