ప్రజాప్రస్తానం మహాపాదయాత్రను తిరిగి ప్రారంభించిన వైఎస్ షర్మిల
హైదరాబాద్ నుండి నేరుగా నల్గొండ జిల్లా కొండపాక గ్రామానికి చేరుకున్న షర్మిల
YS Sharmila: ప్రజాప్రస్థానం మహా పాదయాత్రును మళ్లీ తిరిగి ప్రారంభించారు వైఎస్ షర్మిల. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఆమె..నేరుగా నల్గొండ జిల్లాలోని కొండపాక గూడెం గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడి స్థానికులతో సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం మహా పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా వారి వద్దకే వెళ్లి తెలుసుకునేందుకు YSRTP అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా కారణంగా నవంబర్ 9న తాత్కాలికంగా వాయిదా పడిన ఈ యాత్రను.. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా విఫలమైందన్నారు షర్మిల. ఉద్యోగాలు లేవని ఎంతో మంది నిరుద్యోగులు తనువు చాలించారని, రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటివి అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు షర్మిల.