YS Sharmila: ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల దీక్ష

YS Sharmila: ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలని నిరసన..మూడు రోజుల పాటు దీక్ష చేయనున్న షర్మిల

Update: 2021-04-15 02:39 GMT

వైస్ షర్మిల ఫైల్ ఫోటో

YS Sharmila: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. వైఎస్ షర్మిల నేతృత్వంలో రాబోయే రాజకీయ పార్టీకి ఈ నెల తొమ్మిదవ తేదిన ఖమ్మంలో బీజం పడింది. అయితే సంకల్ప సభ పేరుతో జరిగిన మొదటి సభ లోనే షర్మిల ప్రభుత్వానికి అల్టిమేటం జారి చేసింది. ఈనెల 15 లోపు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రాకుంటే తాను నిరసన దీక్ష చేస్తానని ప్రకటించింది. ఈ మేరకు ఇందిరా పార్కు దగ్గర షర్మిల దీక్ష చేయనుంది.

వైఎస్ షర్మిల మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. నిరుద్యోగుల కోసం ఆమె నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిరాహార దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిల రెడీ అయ్యారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ఆందోళనలు చేస్తామని వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసుల అనుమతి కోరారు.

అయితేమొదట షర్మిల మూడు రోజుల పాటు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు.. పోలీసులు మాత్రం ఒక్కరోజు మాత్రమే దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చారు. దీంతో లోటస్ పాండ్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మరి షర్మిల మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తారా లేదంటే ఒక్కరోజు మాత్రమే చేస్తారా అనేది సస్పెన్స్ గా ఉంది.

మూడు రోజుల పాటు ధర్నా చేసేందుకు షర్మిల సిద్ధం అయ్యారు.. కానీ, కొవిడ్ నిబంధనలు దృష్టిలో ఉండటంలో అనుమతిని కుదించారు. అయితే.. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేసేంత వరకు తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేస్తున్నారు.

పార్టి ప్రకటన తరువాత షర్మిల చేపట్టబోయే మొదటి దీక్ష కావడం...ఉద్యోగాల కల్పన కోసం ఈ దీక్ష చేస్తుండడం తో తెలంగాణ లోని వివిద ఉద్యమకారులను కూడా ఈ దీక్షలో పాల్గొనాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇందిరా పార్కు దగ్గర దీక్షకు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, చుక్కా రామయ్య, ఆర్‌ కృష్ణయ్య తదితరులను దీక్షకు వచ్చి సంఘీభావం తెలపాల్సిందిగా ఆహ్వానించినా ఎవరెవరు వస్తారో చూడాలి.


Tags:    

Similar News