షర్మిల పాదయాత్రకు వచ్చిన కూలీల ఆందోళన.. కూలీ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని...

YS Sharmila: రోజుకు రూ.400లు ఇస్తామని... ఇవ్వకుండా ఏంటని నిలదీసిన మహిళలు...

Update: 2022-04-22 10:30 GMT

షర్మిల పాదయాత్రకు వచ్చిన కూలీల ఆందోళన.. కూలీ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని...

YS Sharmila: వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తలపెట్టిన పాదయాత్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టిన షర్మిళ రోజువారీ కూలీలిస్తూ... మహిళలకు ఉపాధికల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంజిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో షర్మిల పాదయాత్రసాగుతోంది. పాదయాత్రలో కలసి నడిచేవారికి రోజుకు నాలుగు వందలరూపాయలను కూలీకింద ఇస్తున్నట్లు సమాచారం.

ఆయా ప్రాంతాలకు చెందిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు పాదయాత్రకు వచ్చేవారికి ఇచ్చేవిధంగా ఒప్పంద చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్రలో వివాదం చెలరేగింది. సుమారు 50 మంది మహిళలు వై ఎస్ ఆర్ టి పి జిల్లా అధ్యక్షుడు ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. తాము కూలీగా వచ్చినందుకు పాదయాత్రలో పాల్గొన్నందుకు రోజుకు 400 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

కూలీ డబ్బులు ఇవ్వమంటే మొహం చాటేస్తూ మమ్ములను ఇబ్బంది పెడుతున్నారంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. రాజన్న బిడ్డ షర్మిల ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాదయాత్రలో కలసి నడిచేవారంతా స్వచ్ఛందంగా వచ్చారనుకున్నారు. తాజాగా కొత్తగూడెంలో పాదయాత్ర కార్యకర్తలు కూలీకోసం గొడవకు దిగడంతో అసలు విషయం వెలుగుచూసింది.

Tags:    

Similar News