Telangana: నేడు విద్యార్థులతో షర్మిల సమావేశం

Telangana: పలు యూనివర్శిటీలకు చెందిన 350 మంది విద్యార్థులతో భేటీ

Update: 2021-02-24 03:09 GMT

షర్మిల (ఫైల్ ఇమేజ్) 

Telangana: వైఎస్ షర్మిల నేడు విద్యార్థులతో భేటీకానున్నారు. తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో షర్మిల సమావేశం కానున్నారు. లోట్‌సపాండ్‌లో జరగనున్న ఈ సమావేశంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొనున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తీరుతో పాటు పలు అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలను షర్మిల తెలుసుకోనున్నారు.

పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలువురు నేతల అభిప్రాయాలు తీసుకున్న షర్మిల ఇవాళ పలు యూనివర్శిటీల స్టూడెంట్స్ తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో విద్యార్ధులు ఎదుర్కోంటున్న సమస్యలతో పాటు పార్టీ ఏర్పాటుపై వారి అభిప్రాయాలను కూడా షర్మిల తెలుసుకునే అవకాశం ఉంది. వరుసగా పలు జిల్లాల నేతల బేటీ అవుతున్న ఆమె.. నిన్న ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ నుంచి పలువురు అభిమానులతో సమావేశం అయ్యారు.

Full View


Tags:    

Similar News