కరోనా బాధితునికి చికిత్స చేయడం కోసం యశోదా ఆస్పత్రి వైద్యులు కేవలం ఐదు రోజులకే రూ.3.40 లక్షలు ఛార్జ్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వీడియో వైరల్ అవడంతో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ లలితా రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో తమ హాస్పిటల్ పై దుష్ప్రచారం జరుగుతుందని ఆమె అన్నారు. తమ వద్దకు వాహెద్ ఆలీ ఖాన్ అనే పేషెంట్ వచ్చాడని, అతను తీవ్రమైన లంగ్స్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడని ఆమె తెలిపింది. దీంతో అతనికి హైపో ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిందని, అంతే కాక ప్రతి గంట గంటకు రక్తం లెవల్స్ చెక్ చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
అతను ఉన్న కండిషన్ ను అర్థం చేసుకుని అతనికి ఐ.సి.యూ సపరేట్ ఐసోలేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. లంగ్స్ లో 90శాతం ఇన్పెక్షన్ వచ్చిందని, కానీ అతనికి మెరుగైన వైద్యం అందించి అతన్ని కేవలం 5 రోజుల్లోనే డిశ్చార్జ్ చేశామని లలితా రెడ్డి తెలిపారు. అంతే కాక అతనికి కోవిడ్ టెస్ట్ కూడా నిర్వహించామని దాంట్లో నెగిటివ్ వచ్చిందన్నారు. మా మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం తగదు. మా చికిత్స పట్ల ఫ్యామిలీ మెంబర్స్ సంతృప్తి చెందారన్నారు.
తప్పుడు ప్రచారానికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు
కాగా, యశోదా ఆసుపత్సోరి బిల్షలు విషయంలో మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడిన యాకత్ పుర కు చెందిన మీ సేవ నిర్వాహకుడు ముక్తధీర్ పై కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పేషెంట్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోడు చేసినట్టు తెలుస్తోంది.