Gruha Lakshmi Scheme: దరఖాస్తులు ఇచ్చేందుకు బారులు తీరిన మహిళలు.. స్వీకరించకపోవడంతో ధర్నా

Gruha Lakshmi Scheme: ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేస్తామని కలెక్టర్ హామీ

Update: 2023-07-05 03:00 GMT

Gruha Lakshmi Scheme: దరఖాస్తులు ఇచ్చేందుకు బారులు తీరిన మహిళలు.. స్వీకరించకపోవడంతో ధర్నా

Gruha Lakshmi Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని శుభవార్త చెప్పడంతో కలెక్టర్ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో మహిళలు బారులుతీరారు.

గృహ లక్ష్మి పథకంలో 3 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికీ వస్తుందని ఆశతో జిల్లాలోని వివిధ గ్రామాల మహిళలు గృహలక్ష్మి దరఖాస్తులతో కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. తెచ్చిన దరఖాస్తులు స్వీకరించకపోవడంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నిండిపోయింది. మరి కొంతమందిని గేట్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు పోలీసులు అడ్డుకున్నాక గేటుని నెట్టి కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ప్రజా సంఘాలు నాయకులు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు.

కలెక్టర్ బయటకు వచ్చి సమస్యను పరిష్కరించాలని... దరఖాస్తులు స్వీకరించాలని నినాదాలు చేయడంతో, కలెక్టర్ హేమంత్ స్పందించి బయటికి వచ్చి అర్జీదారులకు హామీ ఇచ్చారు. కలెక్టర్ కార్యాలయం ముందు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి దగ్గరి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. హామీ ఇవ్వడంతో శాంతించి ఆందోళనను విరమించారు.

Tags:    

Similar News