TS BJP: తెలంగాణలో బీజేపీ సైలెన్స్‌ అవుతుందా?

TS BJP: అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్న బీజేపీ నాయకత్వం

Update: 2023-09-23 03:10 GMT

TS BJP: తెలంగాణలో బీజేపీ సైలెన్స్‌ అవుతుందా?

TS BJP: తెలంగాణలో బీజేపీ కాస్తా సైలెన్స్‌ అయ్యిందా అంటే అవునానే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల సమరానికి తెరలేపింది. కాంగ్రెస్‌ కూడా గత నెల రోజులుగా హడావిడి చేస్తోంది. ఢిల్లీలో వరుస స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొల్లికి వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ బీజేపీలో ఇప్పటి వరకు అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు.

రాష్ట్రంలో ఇంత జరుగుతున్న కమలం పార్టీలో కదలికలు లేవు. ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఎన్నికల కోసం దూకుడుగా వెళ్తున్న.. బీజేపీ మాత్రమే అంటి ముట్టనట్లు వ్యవహరిస్తోంది. అధిష్టానం అభ్యర్ధుల ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్న రాష్ట్ర పార్టీ మౌనంగా ఉంటుంది. టిక్కెట్ల ఎంపికపై ఇప్పటి వరకు కోర్‌ కమిటీ మీటింగ్‌ కూడా జరగలేదు..గతంలో పోటీకి సిద్ధంగా ఉన్న బలమైన నేతలను మొదటి లిస్ట్‌ అభ్యర్ధులుగా ప్రకటిస్తారని ప్రచారం జరిగిన.. రాష్ట్ర పార్టీలో మాత్రం ఎలాంటి హడావిడి లేదు..ఇతర పార్టీల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత..అక్కడ టికెట్‌ రానీవారు బీజేపీలోకి వస్తారని రాష‌్ట్ర నాయకత్వం భావిస్తుంది. బీజేపీ రాష్ట్ర నేతల మౌనంతో పార్టీకి నష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. 

Tags:    

Similar News