Will Revanth Reddy prove is calibre in GHMC elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండడంతో హస్తం నేతలు అలర్ట్ అవుతున్నారు. గ్రేటర్ లో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీభవన్ లో ప్రత్యేకంగా సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండుకు పైగా డివిజన్లను సొంతం చేసుకునేలా ప్రణాళికలు రచించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
2021 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవ్వాలని పార్టీ నేతలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ సూచించారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రత్యేకంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలను ఆశామాషిగా తీసుకోవద్దని ఉత్తమ్ సూచించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లో టీఆర్ఎస్ హామీల అమలుపై ప్రచారం చేయాలని తీర్మాణించారు. కాంగ్రెస్ లో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలు తప్పించి మిగతావన్నీ జీహెచ్ఎంసీ పాలన పరిధిలో ఉన్నాయి. ఇక్కడ పట్టు నిలుపుకుంటే లోక్ సభ నియోజకవర్గం పరిధిలో తనకు తిరుగుండదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్ కార్పొరేషన్లు, దమ్మాయిగూడ, నగారా, ఘట్ కేసర్, మేడ్చెల్ వంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఓఢిపోయింది. అప్పటి లోటుపాట్లను సరిచేస్తూ. సర్కిళ్ల వారీగా కాంగ్రెస్ నేతలను ప్రోత్సహిస్తున్నారు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్ రూం ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీ, కాలనీల సమస్యలపై నిత్యం దృష్టి పెట్టి ప్రజా పోరాటాలు చేయాలంటున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి నేతలు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.