Warangal TRS leaders: ఓరుగల్లు గులాబీ నేతలు ఒక్క చాన్స్‌ అని ఎందుకంటున్నారు?

Update: 2020-08-03 05:26 GMT

Warangal TRS leaders: ఆ జిల్లాలోని సీనియర్ గులాబీ నేతలంతా ఇప్పుడు ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నారు. పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకుంటూ ఒక్కచాన్స్ ఇవ్వండని వేడుకుంటున్నారు. వయస్సు మీదపడింది. రిటైర్డ్ మెంట్ కు దగ్గరున్నాం ఒక్కచాన్స్ ఇస్తే ప్రజాసేవలో రుణం తీర్చుకుంటామంటున్నారట ఇంతకీ వారి టార్గెట్ ఏంటీ? ఆ సీనియర్ నేతలంతా ఎందుకు పోటీపడుతున్నారు. వారి ముందున్న గండమేంటీ..? తెలుసు కోవాలనుకుంటే ఈ స్టోరీ చూడండీ.

తెలంగాణలో మూడు ఎంఎల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. వాటికి ఎన్నికల నగారా మోగబోతోంది. ఆ స్థానాలు మళ్లీ వారికే రెన్యువల్ చేస్తారా లేక కొత్తవారికి చాన్స్ ఇస్తారా అనేది అంతా గులాబీబాస్ చేతిలోనే ఉంది. కానీ ఆశావహులు మాత్రం ఎవరికివారు తెగ ఆరాటపడుతున్నారు. అవకాశం కోసం అధినేత జపం చేస్తున్నారు. కొత్తా-పాత, సీనియర్-జూనియర్ నేతలంతా ఇప్పుడు ఆ ఎంఎల్సీ సీటుపైనే కన్నేశారు. పార్టీకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న తనకే, ఎంఎల్సీ సీటు కేటాయించాలని కోరుతూ పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకుంటున్నారు. వీరిలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు సీనియర్ నేతలు చేయని ప్రయత్నం లేదు. గులాబీబాస్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న తమకే, ఎంఎల్సీ పీఠం దక్కుతుందని ఎవరికివారు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ సీతారాంనాయక్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్ రావు, అధినేత ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వారికి సంకేతాలున్నాయని వీరి అనుచరవర్గంలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అధినేత నుంచి ఫోన్ కాల్ ఎప్పుడొస్తుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారట.

వీరి పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న ప్రచారమైతే జరుగుతోంది. ఇందులో రాములు నాయక్ ప్లేస్ ను మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో భర్తీ చెయ్యాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఏడో సీటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు దక్కుంతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. వీరంతా ఎవరికివారు అధినేతను ప్రసన్నం చేసుకుని ఆర్జీ పెట్టుకున్నారు. అదృష్టం తలుపుతట్టే తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో రాష్ట్రంలోనే టాప్ లో ఉంది వరంగల్ ఉమ్మడి జిల్లా. ఆరుగురు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు జిల్లా నుంచి. వారిలో ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి, పల్లారాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వున్నారు. ఈ ఆరుగురూ వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినవారే. సో ఇంతమంది ఒకే జిల్లా నుంచి ఎంఎల్సీలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఏడవ సీటు కూడా ఓరుగల్లుకే దక్కుతుందా లేదా పక్క జిల్లాకు చెందినవారు ఎగరేసుకుపోతారా అనే చర్చ జరుగుతోంది. ఏదీ ఏమైనా, ఆశావాహులు మాత్రం గంపెడంత ఆశతో అధినేత ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.

Full View


Tags:    

Similar News