TS BJP Manifesto: మేనిఫెస్టో ఎందుకు లేట్..?
TS BJP Manifesto: పలుసార్లు భేటీ అయిన బీజేపీ మేనిఫెస్టో కమిటీ
TS BJP Manifesto: రానున్న ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ మేనిఫెస్టోలు ప్రకటించగా... ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీములను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.. కానీ బీజేపీ మాత్రం ఇంతవరకు మేనిఫెస్టో ప్రకటించలేదు.. వ్యూహాత్మకంగానే మేనిఫెస్టోను కమలం పార్టీ ఆలస్యం చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే నవంబర్ మొదటి వారంలో బీజేపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, వైద్యంపై హామీ ఇచ్చిన బండి సంజయ్... ఆ రెండు అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఈ క్రమంలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ప్రజల్లోకి వెళుతుందనే భావనలో కమలం పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా... మేనిఫెస్టోలో ఇంద్రధనస్సు.. నవరత్నాలు... కొన్ని పేర్లతో ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలని కమలం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలను పొందుపరచాలనే అంశంపై మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఇప్పటికే మేధావుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలపైన పలు సార్లు మేనిఫెస్టో కమిటీ కూడా భేటీ అయింది. బీఅర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాల కంటే.. మెరుగైన పథకాలను ప్రవేశపెట్టాలని బీజేపీ యోచిస్తోందని సమాచారం... మేనిఫెస్టో ప్రకటన తర్వాత బీజేపీ వైపు ప్రజలు చూస్తారని కాషాయ పార్టీ యోచిస్తోంది. మేనిఫెస్టోలో పొందుపరిచే ప్రతి అంశాన్నీ ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తామంటున్న కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఏదేమైనా కాషాయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంలో తత్సారం వెనుక నిగూఢ రహస్యం దాగి ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.