Weather Updates : పదిరోజుల్లో తెలంగాణలో నమోదయిన వర్షపాతం

Update: 2020-08-22 14:37 GMT

ప్రతీకాత్మక చిత్రం 

Weather Updates : గత కొన్ని రోజులుగా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్య మధ్యప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 2 రోజుల్లో పశ్చిమ దిశలో ప్రయాణించి రాజస్థాన్ వైపు వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ రాజారావు తెలిపారు. ఈనెల 24న ఉత్తర బంగాళాఖాతం ,దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ సాధారణం కన్నా 52 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 28 శాతం ఎక్కువ ఒక శ్రీకాకుళం లో సాధారణం కన్నా 25 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు.

రాయలసీమలో సాధారణం కన్నా 87 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఇప్పటి వరకు నమోదైన అల్పపీడన ల్లో జూన్ 9 న , జులై లో 5 న ఒక్కో అల్పపీడనం ఏర్పడగా ఆగస్ట్ లో 4,9,13,19 వరుసగా నాలుగు అల్పపీడనాలు ఏర్పడ్డాయన్నారు. గత 10 రోజులుగా వర్షపాతం వివరాల్లో తెలంగాణ లోని 30 జిల్లాలో సాధారణం కన్నా 60 శాతం అధికంగా నమోదు కాగా మెదక్ ,సంగారెడ్డి జిల్లాలో సాధారణం కన్నా 20 శాతం అధికంగా నమోదైందన్నారు. గత 10 రోజుల్లో ఒక్క వరంగల్ పట్టణంలోనే సాధారణం కన్నా 151 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ అర్బన్, రూరల్ జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయన్నారు. కోస్తాంధ్ర లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News