Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
Weather Updates : అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.
Weather Updates : అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే, గోదావరి జిల్లాల్లో కుండపోత కురిసే అవకాశముందని ప్రకటించింది. ఇక, దక్షిణ కోస్తాలోనూ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. అలాగే, రాయలసీమలో సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇక, తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయన్న అధికారులు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇక, తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీమ్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ...మరో మూడ్రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని ప్రకటించింది. దాంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పశ్చిమ రాజస్థాన్ మధ్య భాగం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది వాతావరణ శాఖ తెలిపింది. 7.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం దీనికి అనుబంధంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇది క్రమంగా రాగల రెండు రోజుల్లో పశ్చిమ దిశగా రాజస్థాన్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇది ఎత్తున వెళ్లే కొద్ది రైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.