Telangana: ముంచుకొస్తున్న మరో ముప్పు! ఆ ఐదు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్త

Telangana Weather: ఈ ఏడాది ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. ఐదు రాష్ట్రాల వాసులు కరువు ముప్పు కూడా ఉందని నివేదిక వెల్లడించింది.

Update: 2021-03-31 06:04 GMT

Heatwave

Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పగలు ఎండలు రాత్రులు ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. మంగళవారం 38.8 నుంచి 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెనలో 42.8 డిగ్రీలుగా రికార్డయింది. దీంతో తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ప్లానింగ్ సొసైటీ, యూనిసెఫ్, తెలంగాణ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ నివేదికను సిద్ధం చేశాయి.

ఎండల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ తెలంగాణలో ఈ ఏడాది 8 నుంచి 9 నెలల పాటు కరువు ప్రభావం ఉంటుందని రాష్ట్ర వడగాల్పుల ప్రణాళిక నివేదిక స్పష్టం చేసింది. వర్షాకాలంలో మూడు నుంచి నాలుగు నెలల మినహాయిస్తే.. మిగిలిన కాలంలో పొడి వాతావరణంతో నీటి కష్టాలు ఉంటాయని, ఇది వ్యవసాయంపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, మే నెలలో 47 నుంచి 49 డిగ్రీలకు చేరుతుందని హీట్వేవ్ రిపోర్టులో హెచ్చరించారు.

దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలతో సహా మొత్తం ఉమ్మడి ఐదు జిల్లాల పరిధిలో ఈ ఏడాది కరువు ఉంటుందని, ఎక్సెస్ వర్షపాతం నమోదైనా కరువు ప్రభావం ఉంటుందని వెల్లడించారు. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్జిల్లాల్లో కరువు ఉంటుందని వివరించారు. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోనున్నట్లు హెచ్చరించారు.నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ప్లానింగ్ సొసైటీ, యూనిసెఫ్, తెలంగాణ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ నివేదికను సిద్ధం చేశాయి.

ఈ ఏడాది మే నెలలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, దీంతో వడదెబ్బ మరణాలు పెరిగే ఛాన్స్ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో 589 మండలాలుంటే 568 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. 49 సెంటీగ్రేడ్‌లు నమోదయ్యే ఛాన్స్75 శాతం ఉందని, 47 డిగ్రీల వరకు వడగాల్పులు వీచే అవకాశం 100 శాతం ఉందని నివేదికల్లో సూచించారు.

Tags:    

Similar News