తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అకాలు వర్షాలు కురుస్తాయని వారు స్పష్టం చేసారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అకాలు వర్షాలు కురుస్తాయని వారు స్పష్టం చేసారు.ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురియనుందన్నారు.
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందన్నారు. రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్పమత్తంగా ఉండాలని సూచించారు.