CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో 9 నుంచి 13 స్థానాల్లో విజయం సాధిస్తాం
CM Revanth Reddy: ఆరేడు స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్‌లు కూడా రావు
CM Revanth Reddy: రాష్ట్రంలో పార్లమెంట్ఎన్నికల్లో 9 నుంచి 13 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆరేడు స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్‌లు కూడా రావన్నారు. సికింద్రాబాద్‌లో గతం కంటే మెరుగైన పోలింగ్ నమోదైందని, దానం నాగేందర్‌కు కనీసం 20 వేల మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్‌లో బీజేపీ మూడో స్థానంలో ఉంటుందన్న రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్శ్రేణులు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి పని చేశాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ వేవ్ ఏమీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన, ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే రేపటి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానని సీఎం పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై సమీక్షిస్తానని, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, సన్నబియ్యంపై అధికారులను ఆరా తీస్తానని వెల్లడించారు. ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుతామన్న సీఎం, కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 6 నాటికి రైతుబంధు పూర్తిగా ఇచ్చేశామన్న రేవంత్... రేషన్ దుకాణాల ద్వారా ఎక్కువ వస్తువులను తక్కువ ధరకు ఇస్తామన్నారు.