Ponguleti: తెలంగాణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
Ponguleti: ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించడానికి వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం
Ponguleti: తెలంగాణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించడానికి వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి. విపత్తు నిర్వహణ కిందకు వచ్చే తొమ్మిది విభాగాలతో సమావేశమైన పొంగులేటి.. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వరదలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపున ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలన్నారు మంత్రి పొంగులేటి.