Hydeabad: సినీనటుడు బాలకృష్ణ ఇంటిపైకి బుల్‌డోజర్లు..సగం ఇల్లు కోల్పోనున్న జానారెడ్డి

Update: 2024-12-15 02:29 GMT

Hydeabad: టాలీవుడ్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రమంలోనే కేబీఆర్ పార్కు దగ్గర రోడ్డు విస్తరణ పనులు ప్రముఖులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీనటుడు బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ కె. చంద్రశేఖరెడ్డి, రెండు మీడియా సంస్థ యజమానులు, పలువురు బడా వ్యాపారావేత్తలు కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ మహారాజ అగ్రసేన్ కూడలి నుంచి చెక్ పోస్టు వరకు కేబీఆర్ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న ఆర కూడళ్ల డెవలప్ మెంట్ పనులతో ఈ పరిస్థితి నెలకొంటోంది.

ఏం జరిగినా పనులు మాత్రం ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేబీఆర్ పార్క్ జాతీయ ఉద్యానవనం కావడం హద్దు పొడవునా కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సార్డీసీ పేరుతో 2016లో కేబీఆర్ పార్కు చుట్టు పై వంతెనలు నిర్మించేందుకు ప్రయత్నించింది. దీంతో ఆయా పై వంతెనల పిల్లర్లు ఎకో సెన్సిటివ్ జోన్ లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించి ప్రాజెక్టును నిలిపివేపించారు

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్లను మార్చి ఎకో సెన్సిటివ్ జోన్ ను తాకకుండా నిర్మాణాలన్నింటినీ రోడ్డువైపున చేపట్టాలని అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజ అగ్రసేన్, ఫిల్మ్ నగర్, జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45, చెక్ పోస్టు, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు కూడళ్లలో రూ. 1200 కోట్లతో ఏడు ఉక్కు వంతెనలు, 6 అండర్ పాస్ లను నిర్మించే పనుల్లో వేగం పెంచారు.

ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి సంబంధించి 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరిస్తున్నారు. దాదాపు 700 గజాలు నష్టపోయే అవకాశం ఉంది. ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఇల్లు రోడ్డు నెబర్ 45,92 వద్ద ఉండటంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉంది. దాదాపు సగం భూమి కోల్పోవల్సి వస్తుంది. 

Tags:    

Similar News