Revanth Reddy: వరదలకు శాశ్వత పరిష్కారం చూపుతాం

Revanth Reddy: కిరాయి మనుషులతో బీఆర్ఎస్ ధర్నాలు

Update: 2024-10-03 09:25 GMT

Revanth Reddy: వరదలకు శాశ్వత పరిష్కారం చూపుతాం

Revanth Reddy: హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారానకి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.... బీఆర్ఎస్ అడ్డు పడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. నగరాన్ని కాపాడాలన్న మంచి ఆలోచనతో తాముంటే... కిరాయి మనుషులతో బురద రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. పదేళ్లలో తెలంగాణలో దోచుకున్న డబ్బులను మూసీలో మునిగిపోయిన వారికి పంచిపెట్టాలని రేవంత్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని 15 వందల కోట్లలో 500 కోట్ల రూపాయలను పేదవారికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మూసీ మురుగుతో నల్లగొండ ప్రజలు విషం తింటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫాంహౌజ్‌ల నుంచి వచ్చిన మురికినీటిని హైదరాబాద్ ప్రజలు తాగాలా అని నిలదీశారు. ఇంకెన్ని రోజులు ముసీనదిపై రాజకీయం చేస్తారని మండిపడ్డారు. మూసీ నదిపై ఆక్రమణలు చేసింది బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడతారని గ్రహించి ముందుగానే ధర్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News