Mallu Bhatti Vikramarka: ‘రైతు భరోసా’ ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాం
Mallu Bhatti Vikramarka: రైతు భరోసా అమలుపై ఖమ్మంలో మంత్రుల వర్క్ షాప్
Mallu Bhatti Vikramarka: రైతు భరోసా పథకంపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రులు వర్క్ షాప్ నిర్వహించారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేయబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులు, పార్టీల అభిప్రాయం అనంతరం పథకం అమలు అవుతుందని చెప్పారు. రైతుల శ్రమను గుర్తించి ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేశామని భట్టి అన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలను తావు లేదన్నారు. గత ప్రభుత్వంలో పథకాలు అమలు చేసేప్పుడు అభిప్రాయ సేకరణ ఉండేది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు పనిచేస్తుందని ఆయన చెప్పారు.