Warangal: నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వరంగల్ జిల్లా యువకుడు
Warangal: గ్రూప్ - 4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక
Warangal: వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన గడ్డం రంజిత్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. వేణుగోపాల్ - అరుణ దంపతుల పెద్ద కుమారుడైన రంజిత్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలనుకున్న లక్ష్యంతో కష్టపడి చదివాడు.మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన రంజిత్ తల్లి తండ్రులకు అండగా ఉండాలని అనుకున్నాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న రంజిత్ కష్టపడి చదివి.. ఏడు నెలల క్రితం రైల్వే శాఖలో టెక్నీషియన్ గా ఉద్యోగం సంపాదించాడు.
రైల్వేలో ఉద్యోగం చేస్తూనే..రంజిత్ ఎక్సైజ్ పోలిస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ - 4 ఫలితాల్లోనూ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. తాజాగా శనివారం ప్రకటించిన టౌన్ ప్లానింగ్ అధికారి ఫలితాల్లో ఉద్యోగం పొందాడు. నాలుగు ఉద్యోగాలు సాధించిన రంజిత్ ను బంధువులు, గ్రామస్థులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.