UNESCO: యునెస్కో జాబితాలో వరంగల్

UNESCO: నిమజ్జన ఏర్పాట్లు సరిగా చేయలేదని రాస్తారోకోలకు పిలుపు

Update: 2022-09-07 04:52 GMT

UNESCO: యునెస్కో జాబితాలో వరంగల్

Warangal: ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రపంచ గుర్తింపు దక్కింది. గతేడాది ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందింది. తాజాగా వరంగల్‌ నగరాన్ని గ్లోబల్‌ నెటవర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీగా గుర్తింపునిచ్చినట్లు యునెస్కో ప్రకటించింది. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా 44 దేశాల్లోని 77 నగరాలను జీఎన్‌ఎల్‌సీగా గుర్తించినట్లు వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీఎన్‌ఎల్‌సీల సంఖ్య 294కు చేరుకున్నట్లు వివరించారు. 2030 కల్లా ప్రపంచ జనాభాలో సగానికి పైగా నగరాల్లోనే ఉండనుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది.

ఒక నగరం జీఎన్‌ఎల్‌సీ అర్హత పొందాలంటే.. 17 అర్హతలను సాధించాలి. వరంగల్‌ నగరానికి జీఎన్‌ఎల్‌సీ గుర్తింపు రావడం పట్ల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తాజాగా జీఎన్‌ఎల్‌సీగా గుర్తింపు పొందిన 77 నగరాల్లో కేరళ రాష్ట్రంలోని త్రిషుర్‌, నీలంబర్‌ ఉన్నాయి. వీటితోపాటు.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, దక్షిణాఫ్రికాలోని డర్బన్‌, యూఏఈలోని షార్జా నగరాలకు ఈ గుర్తింపు లభించింది.

Full View


Tags:    

Similar News