Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికి వస్తే తోలుతీస్తా...స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాములమ్మ

Update: 2025-04-16 03:51 GMT
Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికి వస్తే తోలుతీస్తా...స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాములమ్మ
  • whatsapp icon

Vijayashanthi: ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నాలెజినోవా తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ. 17లక్షల విరాళాన్ని టీటీడీ అధికారులకు అందించారు. తర్వాత నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. దీనికి సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే కొంతమంది అన్నా తలనీలాలు ఇవ్వడంపై ట్రోల్స్ చేశారు. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరైందని కాదన్నారు. అయితే ఈ ట్రోల్స్ పై సీనియర్ నటి, ఎమ్మెల్సీ విజయశాంతి స్పందించారు.

దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News