విజయమ్మ హౌస్ అరెస్ట్.. ఇంటి వద్దే నిరాహార దీక్ష
Hyderabad: వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Hyderabad: వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా దాడిలో ధ్వంసమైన కారులో షర్మిల ప్రగతిభవన్‌కు బయలుదేరగా పంజాగుట్ట చౌరస్తా వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె వద్దకు బయలుదేరిన వైఎస్ విజయమ్మను లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లోటస్‌పాండ్‌లో పోలీసులతో విజయమ్మ వాగ్వివాదానికి దిగారు. తన కుమార్తెను చూసేందుకు వెళితే ఇబ్బందేమిటని ఆమె పోలీసులను నిలదీశారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసుల చర్యను నిరసిస్తూ విజయమ్మ తన ఇంటిలోనే నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. షర్మిల వచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తా అని విజయమ్మ మీడియాకు తెలిపారు.