Vegetables Price: కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. మ‌ళ్లీ మోత మోగుతున్న ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లు..!

Vegetables Price: కూరగాయాల ధరలకు రెక్కలు వచ్చాయి సామాన్యులకు, మధ్యతరగతి కుటుబాలకు అదనంత దూరంలో కూరగాయల పెరిగిపోయాయి.

Update: 2024-06-17 04:21 GMT

Vegetables Price: కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. మ‌ళ్లీ మోత మోగుతున్న ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లు..!

Vegetables Price: కూరగాయాల ధరలకు రెక్కలు వచ్చాయి సామాన్యులకు, మధ్యతరగతి కుటుబాలకు అదనంత దూరంలో కూరగాయల పెరిగిపోయాయి. కూరగాయలు కొనాలి అంటేనే నగరవాసులు ముందు వెనుక ఆలోచన చేస్తున్నారు. గతంలో రెండు వందల రూపాయలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవి ఇప్పుడు చేతి నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటున్నారు. పెరిగిన ధరలు సామాన్య కుటుంబాలకు పెనుభారంగా మారాయి.

సాధారణంగా వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం వర్షాకాలం మొదలు కావడంతో తగ్గుతుంటాయి. కానీ ఈ ఏడాది అందుకు విరుద్దంగా కనిపిస్తుంది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం ప్రారంభంలోనే రేట్లు అమాంతం కొండెక్కాయి. ఏ కూరగాయ కొందామన్నా కొనే పరిస్థతి లేకుండా పోయింది. పెరిగిన ధరలు సామాన్యులకు భారంగా మారింది.

హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా డిమాండ్ పెరిగి ధరలు భగ్గుంటున్నాయి. ధరలు పెరగటంతో సామాన్యులు తల్లడిల్లుతున్నారు. మరో వైపు వర్షాలతో వాతవరణ పరిస్థితిల్లో మార్పులు సంభవించడంతో కూరగాయలు కుళ్లిపోతున్నాయి. వ్యాపారస్తులు దిగుమతులు క్రమంగా తగ్గించారు. గతంతో పోలిస్తే తక్కువ కూరగాయల సాగు కూడా తగ్గింది. వీటి ప్రభావంతో మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.

మార్కెట్లో ప్రస్తుతం కూరగాయలన్నీ దాదాపు కిలో 80 నుంచి వంద రూపాయల వరకు పలుకుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాట సహా అన్ని కూరగాయల ధరలు 60 శాతం వరకు పెరిగాయి. మొన్నటి వరకు వంద రూపాయలకు ఆరు కిలోలు దొరికిన టమాటా 80 నుంచి వంద రూపాయలు, మిర్చి 80 రూపాయలు, బీన్స్ 90 రూపాయలు, బెండ, బీర ఇతర కూరగాయలు కిలో 80 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు.

మరో రెండు మూడు నెలల వరకు కూరగాయలు ధరలు ఇలానే ఉంటాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో కొత్త పంటలు వేస్తుండటంతో ఆ ప్రభావం కూరగాయల ధరలపై ప్రభావం చూపుతుందంటున్నారు వ్యాపారులు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం ట్రాన్స్ పోర్టు ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని దీంతో కూరగాయలు ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. పంటల దిగుబడి మొదలైతే రాబోయే రోజుల్లో ధరలు తగ్గుముఖం పడుతాయని భావిస్తున్నారు. 

Tags:    

Similar News