Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్..
Vande Bharat: రెండు ఐటీ కారిడార్లను కలుపుతూ రైలు పరుగులు
Vande Bharat: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. రెండు ఐటీ కారిడార్లను కలుపుతూ వందే భారత రైలు పరుగులు పెట్టనుంది. బుధవారం మినహా ప్రతిరోజు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది వందే భారత్ ఎక్స్ ప్రెస్. హైదరాబాద్‌లోని కాచిగూడలో ప్రారంభమై మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, అనంతపూర్ స్టేషన్ మీదుగా యశ్వంత్‌పూర్‌కు చేరుకోనుంది వందేభారత్ ట్రైన్. హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి వేగంగా గమ్యానికి చేరడంతో పాటు..సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుంది.
తెలంగాణలో మూడవ వందే భారత్ రైలు కొట్టాలెక్కింది. ఈసారి వందే భారత్ ఐటీ ఉద్యోగులకు వరం కాబోతోంది. వర్చువల్‌గా ప్రధాని మోడీ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు కాచిగూడలో ప్రారంభమై మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ అనంతపూర్ స్టేషన్ మీదుగా యశ్వంత్పూర్ చేరుకుంటుంది.. మొత్తం 12 జిల్లాల ద్వారా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.. ఉదయం 5:30కి బయలుదేరి మధ్యాహ్నం 2.15 కి యశ్వంత్పూర్ కి చేరుకుంటుంది. మధ్యాహ్నం 3గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
బుధవారం మినహా మిగతా అన్ని రోజులు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలులో 7 చైర్ కార్, 1 ఎకనామిక్ కార్ ఉంటుంది. 530 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉంది. మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపూర్, ధర్మవరం, యశ్వంత్పూర్ లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. క్యాటరింగ్ చార్జెస్ తో కలుపుకొని కాచిగూడ- యశ్వంత్పూర్ మధ్య చైర్ కార్ ధర 1600, ఎగ్జిక్యూటివ్ క్లాస్ 2915 రూపాయలు.
క్యాటరింగ్ చార్జెస్ లేకుండా కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ కి 1255 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ 2515. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐటీ ఉద్యోగులకు ఈ రైలు చాలా ఉపయోగకరంగా భావిస్తున్నారు అధికారులు.