రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్ కు పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపటి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు ధాన్యాన్ని కొంటున్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీతో సయోధ్య కుదుర్చుకుని వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరకు కొనాల్సిందే అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 30వ తేదీ నుంచి జనవరి ఏడో తేదీ వరకు మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టి ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అంద చేస్తామని తెలిపారు. 11న జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతామని 18న రాష్ర్ట వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. మధ్యలో ఒక సారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.