టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్‎లో పాల్గొనడం హాస్యాస్పదం: ఉత్తమ్

టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్‎లో పాల్గొనడం హాస్యాస్పదమన్నారు టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్.. తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఎందుకు రైతు రుణమాఫీ చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Update: 2020-12-08 11:30 GMT

టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్‎లో పాల్గొనడం హాస్యాస్పదమన్నారు టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్.. తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఎందుకు రైతు రుణమాఫీ చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించి సమస్యల గురించి మాట్లాడితే బాగుండేదని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఇక పీసీసీ అధ్యక్ష ఎన్నికపై రేపు పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ వస్తున్నారని, పూర్తిగా చర్చించిన తర్వాతే పీసీసీ ఎంపిక ఉంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.

ఇక కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లుల ద్వారా కార్పొరేట్ సంస్థలు మాత్రమే బాగుపడతాయన్నారు. వ్యవసాయ బిల్లులపై చట్టసభలో కాకుండా గ్రామ సభల్లో చర్చ జరగాలని అన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. 

Tags:    

Similar News