Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్
Bandi Sanjay: గత ఐదేళ్లలో టీటీడీ ఆస్తులు దోచుకునేలా ఏపీలో పాలన జరిగింది
Bandi Sanjay: గత ఐదేళ్లలో టీటీడీ ఆస్తులు దోచుకునేలా ఏపీలో పాలన జరిగిందంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న బండి సంజయ్.. వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులంటూ ఆరోపించారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి.. ఎర్రచందనం దొంగతనం చేశారంటూ విమర్శలు చేశారు బండి సంజయ్. ఎర్రచందనం దోపిడీపై నివేదిక తీసుకుని.. జాతీయ సంపద దోచుకెళ్లిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.