Bhatti Vikramarka: ఏం చేసిన ప్రజల కోసమే.. ఎవరి వ్యక్తిగతం కాదు

Bhatti Vikramarka: హైడ్రా, మూసీ కేంద్రంగా అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది.

Update: 2024-10-07 16:00 GMT

Bhatti Vikramarka: ఏం చేసిన ప్రజల కోసమే.. ఎవరి వ్యక్తిగతం కాదు

Bhatti Vikramarka: హైడ్రా, మూసీ కేంద్రంగా అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ అంశంలో విపక్షాలు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైడ్రాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని భట్టి మండిపడ్డారు. మూసీపై కూడా అపోహలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా.. చెరువుల పరిరక్షణ, మూసీ సుందరీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన.

ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే తప్ప.. తమకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో హైదరాబాద్‌, చుట్టు పక్క ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులతో కలిసి భట్టి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అపోహలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. 2014 నుంచి 2023 మధ్యలో హైద్రాబాద్ చుట్టూ ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వివరించారు.ప్రభుత్వంపై ప్రతిపక్షం నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి.

హైద్రాబాద్ లోని చెరువులు ప్రజల ఆస్తి. హైద్రాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్. ఇవి హైద్రాబాద్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. శాటిలైట్ మ్యాప్ ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.2014 లో ఎన్ని చెరువులున్నాయి. ఇప్పుడెన్ని ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నాం. చెరువులు, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకే హైడ్రాను తీసుకువచ్చినట్టుగా ఆయన వివరించారు. 

Tags:    

Similar News