మెదక్-కాచిగూడ మధ్య ప్యాసింజర్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సంపూర్ణ సహకారం
Kishan Reddy: మెతుకుసీమలో రైలుకూత వినపడింది... మెదక్ వాసుల కల సాకారమైంది... కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి మెదక్-కాచిగూడ మధ్య ప్యాసింజర్ రైలును ప్రారంభించారు. అక్కన్నపేట - మెదక్ మధ్య రైలు మార్గాన్ని కిషన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బ్రాండ్‌ను కాపాడుకోడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనికోరారు. దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రంగా తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోడానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రైల్వే నెట్వర్క్‌ను విస్తృతం చేసేందుకు 15 ప్రాజెక్టులకోసం 9494 కోట్ల రూపాయలను వెచ్చించిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్యాసింజర్ రైలు ప్రారంభోత్సవంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.