ఆదిలాబాద్‌ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర వాటా చెల్లించాలి : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

* 30 కోట్లు చెల్లించకపోవడంతో పూర్తికాని పనులు : కిషన్ రెడ్డి * రూ.120 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం : కిషన్ రెడ్డి * పేదల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ

Update: 2020-12-22 10:13 GMT

వేల కోట్లను దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం 30 కోట్లు విడుదల చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారే తప్పా.. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదిలాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం 120కోట్లు మంజూరు చేసిందన్నారు. అయితే నాలుగేళ్లైన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రూ.30కోట్ల రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. దీంతో కేంద్ర కొనుగోలు చేసిన యంత్రాలు పాడయ్యే స్థితికి చేరుకున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి... అవసరమైన నిధులు విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News