Kishan Reddy: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: శంకర్‌మఠ్ నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు శ్రమదానం
Kishan Reddy: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. నల్లకుంటలోని శంకర్‌మఠ్ నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు ఆయన శ్రమదానం చేశారు. ప్రధాని మోడీ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవాపక్షం పేరుతో దేశవ్యాప్తంగా బీజేపీ, సేవాసంస్థల తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహాత్మగాంధీ ఇచ్చిన స్ఫూర్తితో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.