Kishan Reddy: ఆ ఎమ్మెల్యేలు చేరితే బీజేపీకి వచ్చే లాభం ఏమిటి..?
Kishan Reddy: ప్రభుత్వం పడిపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందా..?
Kishan Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి లేదంటే సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో ఓటమి తప్పదనే టీఆర్‌ఎస్ డ్రామాలని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రులను చేసింది టీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్ కుట్రకు స్క్రిప్టు, డైరెక్షన్, యాక్షన్ అంతా ప్రగతి భవన్ కేంద్రంగానే జరిగిందన్నారు.
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించిన కిషన్‌రెడ్డి సీఎం కుర్చీ చేజారిపోతోందని కల్వకుంట్ల కుటుంబానికి భయం పట్టుకుందన్నారు. అధికారం పోతే అక్రమాలపై దర్యాప్తు జరుగుతుందనే ఇలాంటి డ్రామాలకు తెరలేపారని కిషన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో చేరమని కేటీఆర్.. బీజేపీ నేతలను ఫోన్లో అడగడం నైతికతనా..? అది పోలీస్‌లకు కనిపించలేదా అని ప్రశ్నించారు.