RTC Bus: హైదరాబాద్-విజయవాడ హైవే NH-65పై ఆగివున్న బస్సులో మంటలు
RTC Bus: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు
RTC Bus: హైదరాబాద్-విజయవాడ హైవే NH-65పై ఆగివున్న బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్-విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో మరో బస్సు సాయంతో సెల్ఫ్ ఇచ్చే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో రెండు బస్సులకు అగ్నికి దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.