Delta Variant: తెలంగాణలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు
Delta Variant: పదిరోజుల్లో కోలుకున్న ఫస్ట్ వేవ్ కోవిడ్ బాధితులు * కరోనా మొదటి వేవ్‌లో మరణాల రేటు తక్కువ
Delta Variant: డెల్టా ప్లస్ వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అసలు డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలు ఏంటి..? ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది?
తెలంగాణను డెల్టా ప్లస్ వణికిస్తోంది. అవును.. ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. అయితే మొదటి వేవ్‌లో వారం పదిరోజుల్లో కరోనా బారిన పడివారు కోలుకున్నారు. మరణాల రేటు తక్కువగా నమోదైంది. ఇక సెకండ్ వేవ్‌లో కోవిడ్ బారిన పడిన వారు కోలుకోడానికి 20రోజుల సమయం పట్టింది. మరణాలు కొంత ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో బెడ్స్ దొరకక ఇబ్బంది పడాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు థర్డ్ వేవ్ ముంచుకొస్తొందంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ తెలంగాణలో ఎంట్రీ కావడం భయాందోళనకు గురిచేస్తోంది.
కరోనా వైరస్ మ్యూటేషన్లలో భాగంగా డెల్టా ప్లస్‌గా మారిందంటున్నారు డాక్టర్లు. ఈవైరస్ ఎక్కువగా ఇన్ఫెక్షనల్ వేరియంట్ అని హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ బారిన పడిన వారిలో ఎక్కువ రోజులు వైరస్ ఉండే ప్రమాదం ఉందని.. ఎక్కవ మందికి సోకే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ సోకిన వారు బయటతిరుగుతుండటం వల్లే కేసులు నమోదవుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. కొందరు మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించడం లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తేనే కోవిడ్ బారి నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. మొత్తానికి కోవిడ్ బారినుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలి.